సంక్రాంతి పండగ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జనవరి 10న తిరుపతి-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు, సికింద్రాబాద్- కాకినాడ టౌన్, నర్సాపూర్- సికింద్రాబాద్, 11న కాకినాడటౌన్-సికింద్రాబాద్, సికింద్రాబాద్-నర్సాపూర్, 12న సికింద్రాబాద్- కాకినాడ టౌన్, 13న కాకినాడ టౌన్- తిరుపతి ప్రత్యేక రైలు నడుస్తుందని పేర్కొన్నారు. 16న కాకినాడ టౌన్-సికింద్రాబాద్, 17న సికింద్రాబాద్- కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa