సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె 26వ రోజుకు చేరుకుంది. అలాగే రిలే నిరాహార దీక్షలు రెండువ రోజుకు చేరుకున్నాయి. అంగన్వాడీలకు మద్దతు ఇచ్చి రెండో రోజు రిలే నిరాహార దీక్షలను ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర రాజేంద్రప్రసాద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఒక్కసారి కంటే ఎక్కువ అంగన్వాడీలకు జీతాలు పెంచమన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కంటే ఎక్కువ కరెంటు బిల్లులు, నిత్యావసర వస్తువులు ఎందుకు పెంచుతున్నారని అంగన్వాడీలు ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి మాట తప్పితే వారి గుడ్డలూడదీసి కొట్టమని చెప్పారని... ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భాషలో జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలని నిలదీశారు. అంగన్వాడీలకు సంస్కారం ఉంది కాబట్టి ఏమీ చేయటం లేదన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు లాయర్స్ అసోసియేషన్ అంగన్వాడీలకు అండగా నిలుస్తుందని సుంకర రాజేంద్రప్రాద్ స్పష్టం చేశారు.