తిరువూరులో చంద్రబాబు సభ నిర్వహణపై విజయవాడ వెస్ట్ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. తిరువూరులో చంద్రబాబు సభకి విజయవాడ నుంచి ర్యాలీగా వెళ్తున్నామన్నారు. 2024లో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేయబోతున్నామని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఎవరనేది చంద్రబాబు చెబుతారన్నారు. అందరం కలిసికట్టుగా పార్టీ గెలుపునకు పనిచేస్తామన్నారు. టీడీపీలో పదవులు ఇవ్వటంతో పాటు నేతలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని బుద్దా వెంకన్న వెల్లడించారు. వైసీపీలో పదవులు ఇవ్వడమే కాదు.. ఆ నేతలకు గుర్తింపు తీసుకురావాలని పేర్కొన్నారు. టీడీపీలో ఉన్న బీసీ నేతలకు.. వైసీపీలో ఉన్న బీసీ నేతలకు పోలిక లేదని బుద్దా వెంకన్న అన్నారు. వైసీపీలో ఒకరైనా గుర్తింపు పొందిన బీసీ నేత ఉన్నారా? అని ప్రశ్నించారు. ఆర్ కృష్ణయ్యకి రాజ్యసభ ఇవ్వటాన్ని మేము తప్పుపట్టబోమన్నారు. రాజ్యసభలలో ఫ్లోర్ లీడర్ పదవి కృష్ణయ్యకి ఎందుకివ్వలేదని ప్రశ్నించారు. టీడీపీ బీసీ నేతలకి ప్రయారిటీతో పాటు గౌరవం ఇస్తుందన్నారు. వైఎస్ కుటుంబాన్ని కొడాలి నాని గౌరవిస్తాడు తప్ప.. ఎన్టీఆర్ కుటుంబానికి ఇవ్వబోడన్నారు. చంద్రబాబు అరెస్టు చేస్తే 100 దేశాలలో ఆందోళన చేశారని.. కొడాలి నానిని ఏ దేశం వెళ్ళినా వదలరని బుద్దా వెంకన్న అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa