గత 26 రోజులుగా సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలపై జగన్ సర్కార్ ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. అంగన్వాడీల సమ్మెను నిషేధిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వారిని అత్యవసర సర్వీసు కిందకు తీసుకొస్తూ జీవో జారీ చేసింది. ఆరు నెలలు పాటు సమ్మె నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.