ప్రజలు వ్యతిరేకించిన వైసీపీ ఎమ్మెల్యేలు మరోచోట పోటీ చేస్తే ఎలా గెలుస్తారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ...రాష్ట్రంలో బ్రిటీష్ పాలన చేస్తూ, సీఎం జగన్ దోపిడీకి తెరలేపారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందన్నారు. వైసీపీ పార్టీ పై 100శాతం వ్యతిరేకత ఉందన్నారు. జగన్ ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదని చెప్పారు.. జగన్ రోడ్డుపై తిరగలేక హెలికాప్టర్లో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.