తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చింది. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌తో మంత్రి గుమ్మనూరు జయరాం,నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి , దర్శి ఎమ్మెల్యే మద్ది శెట్టి వేణుగోపాల్, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు వచ్చారు. కాగా మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వచ్చారు. పార్టీ కీలక నేతలతో చర్చించి ఇన్చార్జిలను సీఎం జగన్ ఖరారు చేస్తున్నారు. అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. పలు నియోజకవర్గాల ఇన్చార్జిల మార్పులపై సీఎం వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారు.