2019 లో ఒక్క ఛాన్స్ ఇచ్చారు.... ఇప్పుడు మోసపోయామని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో జగన్ ముద్దులు పెట్టి ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అయన మాట్లాడుతూ.... రాష్ట్రాన్ని సైకో చేతిలో పెడితే ఐదేళ్లలో ఐదు కోట్ల మంది బాధితులు అయ్యారు. టీడీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తే....జగన్ గంజాయి ఇస్తున్నాడు. జగన్ ప్రభుత్వంలో వీరబాదుడు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఏపీలో విద్యుత్ ఛార్జీలు ఎక్కువ. జగన్ దోపిడీ వల్ల విద్యుత్ బిల్లులు పెరిగాయి. చెత్త నుంచి సంపద సృష్టించాలని మేం ప్రయత్నించాం. చెత్త మీద పన్ను వేసిన చెత్త ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు జరుగుతున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో ఇసుక ఉచితంగా ఇస్తే జగన్ ట్రాక్టర్ ఇసుకకి 5000 వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు. జగన్ నాసిరకం మద్యం అమ్మి పేదల రక్తం తాగుతున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాణ్యమైన మద్యం తక్కువ ధరకే ఇస్తాం అని చంద్రబాబు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa