టీడీపీ-జనసేన కూటమి అధికారం లోకి రాగానే ఏపీ భూ హక్కు చట్టం-2022ను రద్దు చేస్తామని న్యాయవాదులకు జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ హామీ ఇచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన బెజవాడ, మంగళగిరి, తెనాలి, గుంటూరు బార్‌లకు చెందిన న్యాయవాదులతో ఆయన మాట్లాడారు. చట్టం అమలులోకి వస్తే కలిగే నష్టాలను బెజవాడ బార్ ఉపాధ్యక్షుడు పుప్పాల శ్రీనివాసరావు, బార్ మాజీ ప్రధాన కార్యదర్శి గంధం శ్రీనివాస్, సోము కృష్ణ మూర్తిలు పవన్‌కు వివరించారు. భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా న్యాయ వాదులు చేస్తున్న నిరసన దీక్షలకు తన మద్దతును పవన్ తెలిపారు. రెండు రోజుల్లో గుంటూరు బార్‌కు వెళ్తానని, ఆ తర్వాత బెజవాడ బార్‌కు విచ్చే స్తానని అన్నారు. జనసేన పార్టీ ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్లి చట్టం వలన కలిగే నష్టాన్ని తెలియజేస్తానని న్యాయవాదులకు హామీ ఇచ్చారు. నామాల కోటేశ్వరరావు, కొప్పెర కోటే శ్వరరావు ఉన్నారు.