యానాం ప్రజల అవసరాలకు (డపింగ్ యార్డు) జిల్లాలోని 5ఎకరాల భూమిని యానానికి కేటాయించాలని కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్‌కు పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు కోరారు. యానాం పరిపాలనాధికారి మునిస్వామి, మల్లాడి కాకినాడ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబును కలిసి యానాం విషయాల గురించి వివరించారు. యానానికి ఐదు ఎకరాల భూమిని ఎవరికి ఇబ్బందిలేని ప్రాంతంలో గ్రామాలకు దూరంగా ఇవ్వడానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు. దరియాలత్పి ఆయకట్టు, అడవిపాలెం తీరప్రాంతాలకు తాగు, సాగునీటి అవసరాల కోసం ఏపీ ప్రభుత్వంలో గతంలో కుదుర్చుకున్న ఒప్పంద ప్రకారం నీటిని సరఫరా చేయాలని మల్లాడి కోరారు. ఎస్సీ సొసైటీ రైతులకు కేటాయించిన పందులంక భూమి గురించి కోర్టు ఇచ్చిన ఆదేశాల గురించి కలెక్టర్‌తో చర్చించారు.