చీరాల నియోజకవర్గంలోని పలు మద్యం దుకాణాలను ఎక్సైజ్ సీఐ పి. నాగేశ్వరరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమ్మార్పీకే మద్యం అమ్ముతున్నదీ, లేనిదీ తెలుసుకోవడానికి ఎక్సైజ్ పోలీసులు మద్యం కొనుగోలుదారుల మాదిరిగా వెళ్లి డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు.
తదుపరి ఆయా దుకాణాలలో స్టాక్ నిల్వలను, రికార్డులను పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి ఉల్లంఘనలు లేవని సీఐ చెప్పారు. బెల్టు దుకాణాలకు మద్యం ఇవ్వొద్దని వారిని ఆదేశించారు.