ఉద్యోగులు హార్డ్ వర్క్ చేయొద్దు.. స్మార్ట్ వర్క్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాజ్యాంగ దినోత్సవ సభలో ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులతో మాట్లాడుతూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎక్కువ గంటలు కార్యాలయంలో ఉండి పనిచేసేవారు. ప్రస్తుతం.. ఆధునిక సాంకేతికత అప్‌డేట్ అవుతోన్న కారణంగా ఆ అవసరం లేదని సీఎం అన్నారు. సాయంత్రం 6 గంటల తరువాత ఉద్యోగులెవరూ కార్యాలయాల్లో ఉండొద్దనేది ఇప్పుడు ఈ ప్రభుత్వ విధానం అని చెప్పారు. సచివాలయ ఉద్యోగులు సహా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఎక్కువ గంటలు కష్టపడాల్సిన పనిలేదన్నారు. స్మార్ట్ వర్క్ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. తాను కూడా సచివాలయం నుంచి సాయంత్రం 6 గంటలకే ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నానని సీఎం పేర్కొన్నారు.