కార్తీక మాసం పర్వదినాన్ని పురస్కరించుకొని పంచలింగాల శివాలయంలో వేద పండితులు రవీంద్ర శర్మ పర్యవేక్షణలో పంచ లింగాలకు పంచ అమృతాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. సోమవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని పంచలింగాల శివాలయంలో ముందుగా గణపతికి విశేష అభిషేకాలు నిర్వహించిన అనంతరం ఉదయం నాలుగు గంటల నుండి పంచలింగాలకు అభిషేకాలను నిర్వహించారు.
భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో నది జలాలు పంచ అమృతాలు, పూల మాలలు, పండ్లు కొబ్బరికాయలు,తరలివచ్చి పంచ లింగాలకు అభిషేకాలు నిర్వహించిన అనంతరం ఉసిరికాయ దీపాలు, 365 వత్తులతో ప్రత్యేక దీపాలను వెలిగించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, జంట నాగులకు, నవగ్రహాలకు భక్తులు విశేష పూజలు నిర్వహించి నైవేద్యాలను సమర్పించారు. ఉదయం నుంచి భక్తులతో పంచలింగాల శివాలయం కిటకిటలాడింది