ఆర్అండ్బీ ద్వారా మంజూరైన రూ. 23 కోట్ల వ్యయంతో రహదారి నిర్మాణాన్ని చేపడుతున్నట్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు.కంబదూరు మండలం కోటగుడ్డం వద్ద 13 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజచేసి పనులను ప్రారరంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ... కోటగుడ్డం నుంచి పేరూరు వరకు ఈ రోడ్డు పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 14 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వంలోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం రామ్మోహన చౌదరి, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి అమిలినేని లక్ష్మీనారాయణ, వాల్మీకి కార్పొరేషన రాష్ట్ర డైరెక్టర్ వైపీ రమేష్, టీడీపీ కన్వీనర్ శివన్న, మాజీ సర్పంచ గాజుల శ్రీరాములు, సీనియర్ నా యకులు దండా వెంకటేశులు, తలారి యర్రిస్వామి ఆవుల తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.