నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం నరసరావుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్ కి ఘనంగా నివాళులు అర్పించారు. తదుపరి పిడిఎం రాష్ట్ర సీనియర్ నాయకులు
వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం పౌరులందరికీ సమానమైన హక్కులు కల్పించిందని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను, నేటి బిజెపి పార్టీ, కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శించారు.