ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు భద్రత అవసరం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 26, 2024, 06:01 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తనకు కల్పిస్తున్న ఎక్స్(X) 1+1 భద్రతను వెనక్కి తీసుకోవాలని విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి కోరారు. ఈ మేరకు గన్ మ్యాన్లను వెనక్కి తీసుకోవాల్సిందిగా ఏపీ డీజీపీ, విశాఖ పోలీస్ కమిషనర్‌కు శారదాపీఠం తరఫున లేఖ అందజేశారు. 2019 నుంచి 2024 వరకూ తన భద్రతా, శ్రేయస్సు కోసం ప్రస్తుత, మునుపటి ప్రభుత్వాలు పోలీసు రక్షణ అందించాయని స్వామీజీ లేఖలో పేర్కొన్నారు. 2019 నుంచి శారదాపీఠానికి మద్దతు ఇచ్చినందుకు వైసీపీ, కూటమి ప్రభుత్వాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపై రిషికేశ్‌లో తపస్సులోనే ఎక్కువ సమయం కేటాయించాలని భావించటంతో తనకు కల్పించిన ఎక్స్ కేటగిరీ వెనక్కి తీసుకోవాలని శారదాపీఠం స్వరూపానందేంద్రస్వామి కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com