రాష్ట్ర ప్రధాన రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలన్న అంశంపైనా సీఎం సమక్షంలో చర్చ జరిగింది. గతంలో జాతీయ రహదారులను బాగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి టోల్గేట్లు ఏర్పాటుచేస్తే ప్రజలు స్వాగతించారని గుర్తుచేశారు. స్టేట్ హైవేలను కూడా అభివృద్ధి చేసి భారీ వాహనాల నుంచి మాత్రమే టోల్ వసూలు చేసేలా ఏర్పాట్లు ఉండాలని చెప్పారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లకు రుసుము ఉండకూడదన్నారు.