పల్నాడు జిల్లాలో తక్షణ మరమ్మతుల కోసం భారీగా నిధులు కేటాయించారు. ఏడు నియోజకవర్గాల్లో జిల్లా ప్రధాన రహదారుల మరమ్మతుల నిమిత్తం 4.86 కోట్లు కేటాయించారు. అత్యధికంగా గురజాల నియోజకవర్గానికి 1.12 కోట్లు కేటాయించగా, చిలకలూరిపేటకు 93.7 లక్షలు, నరసరావుపేటకు 89.6 లక్షలు, మాచర్లకు 85 లక్షలు చొప్పున కేటాయించారు. వీటితోపాటు అత్యవసర మరమ్మతుల కింద 567.8 కిలో మీటర్ల రహదారుల్లో 82 పనులకు మొత్తం 22.44 కోట్లు కేటాయించారు. వీటిలో 72 మరమ్మతులకుగానూ 3.44 కోట్లు, 371 కి.మీ మేర ప్యాచ్ వర్కుల నిమిత్తం 11.57 కోట్లు, రోడ్డు అంచుల ప్యాచ్ వర్కుల కోసం 94.5 లక్షలు, కంపచెట్ల తొలగింపు కోసం 91.7 లక్షలు, వర్షపు నీటికి దెబ్బతిన్న రోడ్లకు 4.15 కోట్లు కేటాయించారు. ప్రధానంగా రొంపిచర్ల, చిలకలూరిపేట, మాచర్ల, దాచేపల్లి, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, వినుకొండ, శావల్యాపురం, కారెంపూడి, గురజాల, పిడుగురాళ్ల, క్రోసూరులలో ఈ రోడ్లకు మరమ్మతులు చేయించనున్నారు.