దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగం భక్తజనంతో ఉప్పొంగింది. కార్తీకమాసం ఆఖరి సోమవారం శ్రీముఖలింగేశ్వరుని దర్శనానికి బారులు తీరారు. వంశధారనదిలో స్నానాలు ఆచరించి స్వామి దర్శించుకొని అభిషేకాలు చేశా రు. శ్రీకాకుళం జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో కూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా విజిలెన్ ఎస్పీ బి.ప్రసాదరావు దంపతులు స్వామివారిని దర్శించుకు న్నారు. ఆలయ విశిష్టతను అర్చకులు వినిపించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆర్జేడీ చిన్మయిదేవి స్వామి వారిని దర్శించుకొని పూజలు చేశారు.