ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని కడపలోనే కొనసాగించాలని ఆ బ్యాంకు ఉద్యోగ, అధికార సంఘాల ప్రతినిదులు విశ్రాంత మేనేజర్ గౌరు సాంబ శివారెడ్డి కోరారు. సోమవారం సంఘ నాయకులు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితను ఆమె స్వగృహంలో కలిసి వినతిపత్రం అందించారు. ఏపీలోని నాలుగు గ్రామీణ బ్యాంకులు కలిపి ఒకే గ్రామీణ బ్యాంకుగా ఏర్పడుతున్నందున కడపలో ఉన్న ఏపీజీపీ ప్రధాన కార్యాలయంలోనే కొనసాగించేలా విన్నవించారు. కార్యక్రమంలో హరిప్రసన్న, జగదీశ్వర్ రెడ్డి, ఏపీజీపీ బ్యాంక్ ఆఫీసర్స్ అసోషియేషన నాయకులు పాల్గొన్నారు.