ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.3.32 లక్షల నోట్లను నమిలి మింగేసిన పెంపుడు కుక్క.. మలం నుంచి తీసి అతికించగా 90% రికవరీ

international |  Suryaa Desk  | Published : Sat, Jan 06, 2024, 10:30 PM

ఇంట్లో పెంచుకుంటున్న ఓ పెంపుడు కుక్క.. యజమాని దాచిన డబ్బులను నమిలి మింగేసింది. అయితే ఏ రూ.500, రూ.వెయ్యో కాదు.. 4 వేల డాలర్లు అంటే అక్షరాలా రూ.3.32 లక్షలకు పైమాటే. అయితే కుక్క డబ్బులు తిన్న విషయాన్ని గుర్తించిన దాని యజమానులు లబోదిబోమన్నారు. రూ. 3.32 లక్షల విలువైన సొమ్మును ఆ కుక్క తినేయడంతో షాక్ అయిన ఆ యజమానికి ఏం చేయాలో అర్థం కాలేదు. చివరికి దాని మలం నుంచి నోట్లు సేకరించి వాటిని శుభ్రంగా కడిగారు. అయితే కుక్క మింగేసిన రూ. 3.32 లక్షల్లో 90 శాతం డబ్బులు రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ వింతైన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.


అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. క్లేటన్, క్యారీ అనేదంపతులు తమ ఇంట్లో గోల్డెన్ డూడుల్ రకం కుక్కను పెంచుకుంటున్నారు. అయితే డబ్బులను కాంట్రాక్టర్‌కు ఇచ్చేందుకు రూ.3.32 లక్షల డ‌బ్బుతో ఉన్న ఒక కవర్‌ను కిచెన్‌లో పెట్టారు. అయితే అరగంట తర్వాత చూసే సరికి అక్కడ నానా బీభత్సం జరిగింది. వారు పెంచుకుంటున్న పెంపుడు కుక్క ఆ కవర్‌ను చించేసి అందులో ఉన్న నోట్లను నమిలి మింగేయడం ప్రారంభించింది. ఆకలితో ఉన్న ఆ కుక్క వాటిని ముక్కలుగా చింపుతూ తినేసింది. అందులో కొన్ని నోట్ల ముక్కలను తినేయగా మరికొన్ని ముక్కలను చిందరవందరగా పడేసింది.


అయితే కుక్క డబ్బులను తినేసిందనే విషయాన్ని గ్రహించిన క్లేటన్, క్యారీ దంపతులు.. తల పట్టుకున్నారు. రూ.3.32 లక్షల సొమ్మును ఆ పెంపుడు కుక్క తినేయడంతో ఏం చేయాలో తోచలేదు. ఇక చివరికి ఆ కుక్క మలం ద్వారా అది తిన్న డబ్బులను సేకరించాలని నిర్ణయించారు. దీంతో ఆ కుక్క మలం నుంచి నోట్లను తీసి వాటిని కడిగారు. అయితే అందులో చాలా వరకు నోట్లను కడిగి తీసినట్లు తెలిపారు. కేవలం 450 డాలర్లు అంటే రూ.37 వేలు మాత్రమే పనికి రాకుండా పోయాయని చెప్పారు. రూ.3.32 లక్షల సొమ్ము నుంచి దాదాపు 90 శాతం నోట్లను సేకరించినట్లు వెల్లడించారు. అయితే ఆ కుక్క గతంలో ఎన్నడూ ఇలా ప్రవర్తించలేదని.. అది చేసిన పనికి తాము 450 డాలర్లు నష్టపోయినట్లు క్లేటన్, క్యారీ దంపతులు వాపోయారు. ఇక ఆ చిరిగిన నోట్లను బ్యాంకుకు తీసుకెళ్లగా.. నోట్ల‌పై నెంబ‌ర్ ఉన్న వాటిని మాత్రమే తీసుకుని మార్చి ఇచ్చారు.ఆ నోట్ల‌ను తీసుకుంటామ‌ని బ్యాంక‌ర్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com