విశాఖ పరిధిలోని జ్ఞానపురం నుంచి పెందుర్తి వరకు బి. ఆర్. టి. ఎస్ రోడ్డు మరమ్మతులు, పెయింటింగు పనులను వెంటనే పూర్తిచేయాలని జివిఎంసి కమిషనర్ సాయికాంత్ వర్మ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
శనివారం ఆయన ఐదు, ఎనిమిది జోనల్లోని బి. ఆర్. టి. ఎస్ రోడ్డును అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 రోజుల్లో సంబంధిత పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.