జపాన్లో నూతన సంవత్సరం ప్రారంభం రోజున (సోమవారం) భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఈ భూకంపం దాటికి నోటో ద్వీపకల్పంలో కొత్త బీచ్లు ఏర్పడ్డాయి.
తీరం వెంబడి కొన్ని ప్రదేశాలలో భూమిని 820 అడుగుల వరకు విస్తరించడంతో కొత్త బీచ్లు ఏర్పడ్డాయి. మరీకొన్ని చోట్ల 250 మీటర్లకు పైగా భూమి పైకి వచ్చినట్టు యూనివర్సిటీ ఆఫ్ టోక్యో వెల్లడించింది. దీనికి సంబంధించిన శాటిలైట్ చిత్రాలను అధికారులు విడుదల చేశారు.