రాజస్థాన్ రాష్ట్రం చిత్తోర్ ఘర్ లోని పాండోలి అనే గ్రామంలో జోల్ట్ తల్లి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం మహాభారతం కాలంతో సంబంధం కలిగి ఉంది. ఈ ఆలయ గర్భగుడిలో ఐదుగురు దేవతల విగ్రహాలు ఉన్నాయి.
పక్షవాతం వచ్చిన వారు సరిగా నడవలేరు. అలాంటి వారు ఇక్కడకు ఒకసారి వెళ్తే పూర్తిగా నయమవుతుందని చెబుతున్నారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే.. బతికి ఉన్న కోళ్లను ఆలయంలో విడిచిపెడతారట.