అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు మంజూరు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం, ఓబులంపల్లి సచివాలయాల పరిధిలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి వైఎస్ఆర్ పెన్షన్ కానుకను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కులాలు, మతాలు, పార్టీలకతీతంగా వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను మంజూరు చేస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేస్తోందని అన్నారు.