ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఆదివారం కదిరి మున్సిపాలిటి ఆర్ అండ్ బి అతిధి కార్యాలయం సమీపంలో మునిసిపల్ కమిషనర్, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. బిజెపి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గుడిసె దేవానంద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.