ఏపీమున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం పిలుపు మేరకు ఆదివారం కదిరి మున్సిపల్ కార్యాలయం ముందు నడిరోడ్డుపై భోజనాలు చేస్తూ నిరసన చేశారు. సీపీఐ డివిజన్ కార్యదర్శి ఎస్కే ఇసాక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి ఉండడంతో మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి వెంటనే చర్చలు జరిపి సమ్మెను విరమింపచేయాలన్నారు.