టీడీపీకి కేశినేని నాని దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. పార్టీ తనను వద్దనుకుంటున్నప్పుడు తాను కూడా పార్టీతో కొనసాగలేనని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రా కదలిరా సభ నిర్వహించగా, ఈ సభకు కేశినేని దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. విజయవాడలో కేశినేని నాని కార్యాలయం వద్ద టీడీపీ జెండాలు తొలగించేశారు. పసుపు జెండాలు లేని కేశినేని నాని ఆఫీసు బోసిపోయినట్టుగా దర్శనమిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa