చలికాలం హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. ఇతర కాలాలతో పోల్చితే చలికాలం గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు.
చలికాలంలో క్రమంతప్పకుండా వ్యాయామం చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వెచ్చగా ఉండేలా చూసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని సూచిస్తున్నారు. కేవలం హృద్రోగులకే కాకుండా కంటి సంబంధిత సమస్యలతో బాధపడే వారికి కూడా ముప్పేనట.