టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని కల్పిస్తుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు.
ఆదివారం మాకవరపాలెం మండలం తాడపాల గ్రామంలో నిర్వహించిన పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు. డిగ్రీ చేసిన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు.