భారతదేశంలో రన్ ఆఫ్ కచ్ ఉన్నట్టుగానే సలార్ డి ఉయుని ప్రపంచ అద్భుతం అని పిలుస్తారు. ఎందుకంటే ఉప్పు ఫ్లాట్ల ఉపరితలంపై నీరు నిలిచి ఉండటం వల్ల ఇక్కడ భూమి అద్దంలా కనిపిస్తుంది.
దీనిలో ఆకాశం ప్రతిబింబం కనిపిస్తుంది. 10,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ప్రదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఉప్పు గని. ఇది బొలీవియాలోని డేనియల్ కాంపోస్ ప్రావిన్స్‌లో ఉంది. ఈ ప్రదేశం గురించి ఎంత చెప్పినా తక్కువే.