గుంతకల్లు పట్టణ శివారులోని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున సోమవారం పరిశీలించారు. ట్యాంకులోని నీరు పంపింగ్ చేసే మోటార్ల పనితీరును పరిశీలించారు. నీరులో క్లోరినేషన్, ఫిల్టర్ సక్రమంగా చేయాలని అక్కడి సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా పట్టణంలో 60 అడుగుల రోడ్డులో శాశ్వత పారిశుధ్య కార్మికులు చేస్తున్న పనులను పరిశీలించి, చెత్తను ఎప్పటికపుడు తీసివేయాలని సిబ్బందిని ఆదేశించారు.