అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో జనవరి 22న రాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరగనుండటంతో ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పోటెత్తనున్నారు. పెద్దసంఖ్యలో సందర్శకులు రానుండటంతో త్వరలో హెలికాఫ్టర్ సేవలను ప్రారంభిస్తామని యూపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జైవీర్ సింగ్ వెల్లడించారు. జనవరి 22లోగా హెలికాఫ్టర్ సర్వీసులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa