వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.... 76ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు పెద్దపీట వేసిన చారిత్రక సందర్భం ఆదర్శప్రదేశ్‌లోనే చూస్తున్నాం.మాట తప్పని..మడమ తిప్పని జగన్‌మోహన్‌రెడ్డిలాంటి నాయకుడు చాలా చాలా అరుదు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాల వారిని ఇంతగా గౌరవించి, సముచిత స్థానాల్లో కూర్చోపెట్టిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గొప్ప దార్శనికత ఉన్న నాయకుడు. ఎస్సీ,ఎస్టీలను చులకనగా చూసినవాడు చంద్రబాబు. ముఖ్యమంత్రి స్థాయిని మరిచి నీచంగా మాట్లాడినవాడు చంద్రబాబు. ఎస్సీలకు, ఎస్టీలకు చదువులెందుకు? పదవులెందుకు?కూలీపనులు చేసుకుని బతకండి అన్న నాయకులు టీడీపీలో చాలామంది ఉన్నారు. అందరూ ఈరోజు ఈ ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల ప్రభంజనంలో కొట్టుకుపోయారు. జగనన్నకు జైకొట్టిన బడుగు,బలహీనవర్గాలకు, పేదలకు ఇప్పటిదాకా ఎంతో మంచి జరిగింది. మళ్లీ జగనన్న ముఖ్యమంత్రిగా వస్తే..ఆయా వర్గాలకు, పేదలకు మరింత మంచి జరిగితీరుతుంది. జగనన్న మన గురించే ఆలోచిస్తారు. మన బాగు గురించే ఆలోచిస్తారు అని అన్నారు.