కళ్యాణదుర్గం పట్టణంలో మున్సిపల్ కార్మికులు నిరసన దీక్షలు చేపట్టడంతో కాలనీలలో చెత్తాచెదారం పేరుకుపోయిందని ఆయా కాలనీవాసులు సోమవారం విలేఖరులకు తెలిపారు. కాలనీలలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోందన్నారు. దోమలు పగలు రాత్రి తేడా లేకుండా ఇళ్లల్లో కొరుకుతుండడంతో చాలామంది రోగాల బారిన పడుతున్నారన్నారు. మురికి కాలువల్లో ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోయి దుర్వాసన వస్తుందని కాలనీవాసులు తెలుపుతున్నారు.