ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో సోమవారం మున్సిపల్ కార్మికులు చేపట్టిన నిరసన దీక్షకు భారతీయ జనతా పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. దీక్ష ప్రాంగణానికి వెళ్లిన భారతీయ జనతా పార్టీ నాయకులు మున్సిపల్ కార్మికులను పరామర్శించి వారితో పాటు నిరసన దీక్ష చేశారు. మున్సిపల్ కార్మికులు అడిగిన న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.