వైసీపీ తలపెట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా మాజీమంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ.... 2019లో జగనన్న ముఖ్యమంత్రి అయ్యాకే సామాజిక సాధికారత వెలుగులు మన జీవితాల్లో నిండాయి. ఈ రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన కులాలను వెన్నెముక కులాలుగా, బలహీనవర్గాలను బలవంతులుగా మార్చడమే తన నినాదంగా జగనన్న ముందడుగులు వేస్తున్నారు. ఈరోజు పార్లమెంటు నుంచి జిల్లా స్థాయివరకు అనేక పదవుల్లో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల నాయకులను సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి నిలిపారనిఅన్నారు.