ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీసు స్పందన కార్యక్రమానికి 110 ఫిర్యాదు అందినట్లుగా ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదు దారులు తమ సమస్యల గురించి స్వేచ్ఛగా ఎస్పీకి విన్నవించుకున్నారు. ఈ అర్జీలను సత్వరమే పరిష్కరించాల్సిందిగా ఎస్పీ సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. వారికి త్వరితగితిన న్యాయం చేయాలని ఎస్పీ సూచించారు.