జిల్లాలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా అదనపు బస్సులను నడుపుతున్నట్లుగా జిల్లా ప్రజా రవాణా అధికారి సుధాకర్ సోమవారం తెలిపారు. ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆయన మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి 150, బెంగళూరు నుంచి 5, చెన్నై నుంచి 10 బస్సుల టికెట్లను ముందస్తుగా ఆన్లైన్ లో ఉంచడం జరిగిందన్నారు. ప్రయాణికుల సేవల కొరకు 149 కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుందన్నారు.