జిల్లాలో సోమవారం మరో కరోనా కేసు నమోదయింది. ఒంగోలులోని రిమ్స్ వైద్యశాల వద్ద సోమవారం 24 కరోనా టెస్టులను నిర్వహించగా ఒకరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా రిమ్స్ వైద్యశాల మెడికల్ అధికారి డాక్టర్ తిరుమలరావు తెలిపారు. కరోనా పట్ల ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధారణ పాటించాలని తిరుమల రావు సూచించారు.