ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పరిపాలన కొనసాగుతుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 09, 2024, 02:54 PM

ఏ రాష్ట్రంలోనైనా ఐదేళ్లుగా అధికారంలో ఉంటూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మంచి పరిపాలన అందించిన పాలకపక్షాన్ని మరోసారి గెలిపించుకోవడానికి ఆ రాష్ట్ర ఓటర్లు ఎంతో ఆతృత, ఆసక్తితో మరుసటి ఎన్నికల కోసం ఎదురుచూస్తుంటారు అని వైసీపీ నేతలు అన్నారు. భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇలాంటి సందర్భాలు చూశాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి వాతావరణమే నెలకొని ఉంది. 2019 మే 30న వృద్ధాప్య పింఛన్‌ పెంపు ఫైలుపై నూతన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారి సంతకంతో మొదలైన వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలన దిగ్విజయంగా సాగుతోంది. పేద, దిగువ మధ్య తరగతి ప్రజల అవసరాలు తీర్చడానికి, వారు అన్ని విధాలా తమ జీవితాలను మెరుగుపరుకోవడానికి వైఎస్సార్సీపీ సర్కారు వివిధ పథకాల కింద వారి బ్యాంకు ఖాతాల్లోకి ఇప్పటి వరకూ రూ. 2,46,000 కోట్లు బదిలీ చేసింది. అమ్మ ఒడి, రైతు భరోసా, వైయ‌స్ఆర్‌ ఆసరా, కాపు నేస్తం, నేతన్న నేస్తం, వాహన మిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు వంటి జన సంక్షేమ ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ లేదా నగదు బదిలీ) పథకాల ద్వారా గడచిన 55 నెలల్లో దాదాపు రెండున్నర లక్షల కోట్లు ప్రజలకు అందించింది వైఎస్‌ జగన్‌ సర్కారు. ఇలాంటి ప్రజాహిత రాష్ట్ర సర్కారును మరోసారి గెలిపించి రాజన్న సంక్షేమ రాజ్యం ఇంకా పాతిక ముప్పయి సంవత్సరాలు కొనసాగేలా చూడడానికి ఆంధ్రప్రదేశ్‌ జనం ఉవ్విళ్లూరుతున్నారు. ప్రజలకు నిర్ణీత సమయంలో పై పథకాల కింద నగదు బదిలీ చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం ఏదోవిధంగా డబ్బును సమకూర్చుతోంది. అప్పుడప్పుడూ నిధులు కొరతతో వేతనాలు చెల్లింపు కొద్దిగా ఆలస్యమైనాగాని పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు పై పథకాల కింద డబ్బును వారి అకౌంట్లలోకి జమ చేయడం మాత్రం జాప్యం కాకుండా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. ఇలా అసంఘటిత రంగంలోని బలహీన వర్గాల ప్రజల ఆర్థిక అవసరాలు ఎన్ని కష్టాలకోర్చి అయినా తీర్చడమే తన కర్తవ్యంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com