వైసీపీ తలపెట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ సుధ మాట్లాడుతూ.... అణగారిన వర్గాలను పైకి తీసుకురావాలని.. గతంలో మహనీయులెందరో కలలు కన్నారు. ఆ దిశలో ఎంతో కృషి చేశారు. జగనన్న వారి కలలను అర్థం చేసుకున్నారు. సామాజిక సాధికారత అవసరాన్ని గుర్తించారు. అంబేడ్కర్, ఫూలేల ఆశయాల బాటలో నడిచి, ఈ రోజు ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీల నాయకులను అధికారపదవుల్లో కూర్చోబెట్టి..వారి రాజకీయ,సామాజిక,ఆర్థిక స్థాయిని పెంచారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాలకు చెందిన నలుగురిని డిప్యూటీ సీఎంలుగా చేసి..తన పక్కన కూర్చోబెట్టుకున్నారు జగనన్న. అలాగే మంత్రివర్గంలో ఉన్న 25మందిలో 17మంది ఆయావర్గాల వారికే కేటాయించారు. వైద్యరంగంలో జగనన్న అద్భుతాలు చేశారు. ఏ పేదవాడికైనా జబ్బు చేస్తే ... భయపడాల్సిన అవసరం లేకుండా చేశారు.