ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమ్మె దారులకి ప్రతిపక్షాల మద్దతు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 09, 2024, 04:00 PM

సమగ్రశిక్ష ఉద్యోగులకు, అంగనవాడీ లకు సీఎం జగన ఇచ్చిన హామీ వెంటనే నెరవేర్చాలని జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి భవానీ రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. అనంతపురం లో దీనికి జనసేన, కాంగ్రెస్‌ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా భవానీ రవి కుమార్‌ మాట్లాడుతూ... శాంతియుతంగా సమ్మె చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం బెదిరింపులకు దిగడం హేయమన్నారు. అంగనవాడీలపై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రయోగం చేయడం దుర్మార్గమన్నారు. అంగనవాడీలు, సమగ్ర శిక్ష ఉద్యోగులకు జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అద్యక్షుడు పొదిలి బాబురావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మర నాగేంద్ర, జిల్లా కార్యదర్శులు రాపా ధనుంజయ, వీర మహిళల దాసరి సరిత, సమగ్రశిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన విజయ్‌ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com