ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మతిస్థిమితం లేక యువకుడు ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 09, 2024, 03:58 PM

మతిస్థిమితం లేక అధిక మోతా దులో మాత్రలను మింగి యువకుడు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా, మక్కువ మండలంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్ళితే..... కన్నంపేట గ్రామానికి చెందిన దత్తి మాధవరావు(29) 2 సంవత్సరాల నుంచి మతి స్థిమితం లేక విశాఖ మెంటల్‌ కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మందులు వాడుతున్నాడు. ఈ నెల 2న కన్నంపేటలోని స్వగృహంలో ఎప్పటి లాగే తాను వేసుకునే మాత్రలను అధిక మోతాదులో మింగడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 7న రాత్రి మరణించాడు. మృతుని తల్లి సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ. నరసింహ మూర్తి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com