ఆత్మకూరు నియోజకవర్గంలో ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించిన నలుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫామ్- 7 ద్వారా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ఫిర్యాదు చేసిన నలుగురుపై కేసు నమోదు అయ్యింది. నెల్లూరు, సంగం మండలం చెన్నవరపాడు గ్రామంలో , సంగం మండలం తలుపుల పాడు గ్రామంలో ఫార్మ్- 7 ద్వార 14 ఓట్లు తొలగించేందుకు కొందరు ఫిర్యాదు చేసారు. అలాగే ఏఎస్ పేట మండలం శ్రీ కోలను గ్రామంలో ఫామ్- 7 ద్వార 130 ఓట్లు తొలగించేందుకు, చేజర్ల మండలం ఉలవపల్లి గ్రామంలో ఫామ్- 7 ద్వారా 75 ఓట్లు తొలగించేందుకు కొందరు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa