ఏపీలో ఎన్నికలు సజావుగా జరగాలని కేంద్ర ఎన్నికల సంఘం వచ్చిందని, 1/4 దొంగ ఓట్లు చేర్చారని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయన్నారు. రెండు నెలలముందే పోలీసులను మార్చి నోటిఫికేషన్ సమయానికి వాళ్లు తిరిగి వచ్చేలా ప్లాన్ చేశారని, వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరం పెట్టమని సీఈసీని కోరామన్నారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరుగుతాయని కమిటీ తెలిపిందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.