రాయదుర్గం పట్టణం కోటలో జంబుకేశ్వర స్వామి గుడి సమీపాన ఉన్న ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఉన్న మీటర్ నుండి బుధవారం ఒక్కసారిగా ఉదయం 6 గంటల నుండే నిప్పంటుకున్నది. ట్రాన్స్ఫార్మర్ పక్కనే ఉండడంతో ఏం జరుగుతుందో అంటూ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరెంట్ అధికారులు తక్షణమే స్పందించి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంపచెట్లను తొలగించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa