సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సింగరాయకొండ సర్కిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కోళ్ల పందాలు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సింగరాయకొండ సిఐ రంగనాథ్ బుధవారం తెలిపారు. సింగరాయకొండ పోలీస్ స్టేషన్ లో వారు మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని ప్రజలందరూ సంప్రదాయబద్దంగా నిర్వహించుకోవాలని, ఎక్కడైనా పేకాట, జూదం వంటి ఆటలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.