కొండేపి నియోజకవర్గం వైసీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత నాయకులకు బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కొండేపి సమన్వయకర్త డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో ఒంగోలు లోని ఎంఎస్ ఫంక్షన్ హల్ నందు పార్టీ ఆదేశాలమేరకు సమావేశం ఏర్పాటు చేసినట్లు నాయకులు తెలిపారు. ఈనెల 19న విజయవాడలో జరిగే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణపై చర్చించనున్నట్లు తెలిపారు.