ప్రొద్దుటూరు స్థానిక శ్రీరాములపేట లోని తన కార్యాలయంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ కింద 8 మందికి రూ. 12 లక్షల చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 25 లక్షలకు ప్రభుత్వం పెంచిందన్నారు. నాయకులు ప్రసాదరెడ్డి, రఘునాథరెడ్డి, రాముడు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.