ఉత్తర భారతదేశానికి శీతాకాలం చుక్కలు చూపిస్తోంది. ఉదయం వేళల్లో ఇళ్ల నుంచి ప్రజలు బయటకి రాలేకపోతున్నారు. తీవ్ర చలి, మంచు కారణంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.
ఢిల్లీలో ఉష్ణోగ్రతలు రెండేళ్ల కనిష్టానికి పడిపోయాయి. దీంతో ఢిల్లీలో బుధవారం ఉదయం కనిష్ట ఉష్ణోగ్రత 7.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు భారత వాతావరణ శాఖ పేర్కొంది. గరిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు తెలిపింది.